2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మరోసారి ఆధిక్యం చాటుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 + స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించగా.. అప్పటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా నెంబర్ తో కొనసాగుతుంది. ఇక మరోవైపు చెప్పుకోవాలిసినది కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది. దేశవ్యపథంగా వివిధ పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాల పైగా లీడ్ లో ఉంది. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలవగా., నాటి ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు ఆ పార్టీ బాగా ముందంజలో ఉంది.
Delhi: మరోసారి ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ
ఇకపోతే ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. అక్కడ 60కి పైగా గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకున్న.. కాకపోతే అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ ప్రస్తుతం గట్టిపోటీనిస్తోంది. తాజా వివరాలను పరిగణలోకి తీసుకుంటే.. యూపీలో మొత్తం 80 స్థానాల్లో.. 37 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనపడుతుండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి.
Venu Swamy: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. వేణు స్వామి సంచలన నిర్ణయం!
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. ఇక్కడ మొత్తం 48 నియోజకవర్గాల్లో.. ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందుండగా.. ఎన్డీఎ కేవలం 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అలాగే ఒకస్థానంలో ఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కర్ణాటక విషయం చూస్తే.. అక్కడ బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రములోని 28 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక బీజేపీ మిత్రపక్షమైన జేడీఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.