Liquor party in Police Station: బీహార్‌లో కొన్నేళ్లుగా మద్యపాన నిషేదం అమల్లో ఉంది. దాంతో అక్కడ అక్రమ మద్యం అమ్మకాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి. పాట్నా జిల్లాలోని పాలిగంజ్ నగరంలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు అక్రమ మద్యం తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలో ఉంచారు. ఆ రోజు అదే స్టేషన్లో పనిచేసే కానిస్టేబుళ్లు ఖైదీలతో కలిసి సీజ్ చేసిన మద్యంతో ఫుల్ పార్టీ చేశారు. పీకలదాకా తాగారు. అంతటితో ఆగారా.. చేసుకుంటున్న పార్టీని వీడియో తీశారు. అది అక్కడితో ఆపకుంటా కుటుంబసభ్యులకు సెండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని పాట్నా సీనియర్ అధికారులు చూశారు. దీంతో ఆ కానిస్టేబుళ్లపై చర్యలకు పురమాయించారు. ఐదుగురు ఖైదీలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Haryana: ముందు నువ్వు చస్తావా.. నేను చావనా.. పందెం వేసుకున్న తాగుబోతులు.. సీన్ కట్ చేస్తే
పాలిగంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌డిపిఓ దీక్షిత్ నేతృత్వంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని కుందన్ కుమార్, చందన్ కుమార్, షహన్‌షా అన్సారీ, రామ్‌జీ మాంఝీ, సంజయ్ మాంఝీగా గుర్తించారు. లిక్కర్ పార్టీలో కస్టడీలో ఉన్న నిందితులతో పాటు వీడియోలో కానిస్టేబుళ్లు సియారామ్ మండల్, ఛోటే లాల్ మండల్ పట్టుబడ్డారు. పోలీసు స్టేషన్‌లో భారీ మొత్తంలో దేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ఆయన తెలిపారు.