CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
- ఢిల్లీలో రైతు నాయకుడు రాకేష్ టికాయత్‌తో సీజేపీ నేతల భేటీ.
- రైతులు, విద్యార్థులు, యువతకు ఉమ్మడి వేదిక ఏర్పాటు లక్ష్యంగా చర్చలు.
- విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు టికాయత్ మద్దతు కోరిన సీజేపీ.
- రైతులు, విద్యార్థులతో మోడీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టాలన్న సీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఉద్యమం తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఇప్పుడు సీజేపీ మరో ప్లాన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌పై ఉద్యమించిందేకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీజేపీ నాయకులు ఢిల్లీలో రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్‌ను కలిశారు. రైతులు-విద్యార్థులు-యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేయాలని భావిస్తున్నారు.
సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, ఇతర కాక్రోచ్ ప్రతినిధులు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకులతో కలిసి టికాయత్‌తో సమావేశమయ్యారు. భవిష్యత్తులో రైతులు, యువత కలిసి చేపట్టబోయే వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత రాంకా మాట్లాడుతూ.. ‘‘దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై విద్యా సమస్యలతో పాటు రైతులు, యువత సమస్యల్ని కూడా ఉద్యమంలో భాగం చేయాలని సీజేపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల నిరసన సమయంలో కేంద్ర ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని సీజేపీ ఆరోపించింది. బీహార్, యూపీలలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని పేర్కొంది. విద్యార్థులపై నమోదైన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలని టికాయత్ మద్దతు కోరినట్లు సీజేపీ తెలిపింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలు, యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!