MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
- తిలక్ వర్మ సూపర్ సెంచరీ
- 99 పరుగుల భారీ విజయం
- అశ్విని కుమార్ అదిరే బౌలింగ్
- గుజరాత్ బ్యాటింగ్ కుప్పకూలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చి పాత రోజులను గుర్తుచేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఏకంగా 99 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, తమ ఓటముల పరంపరకు తెరదించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుండి పైకి ఎగబాకడమే కాకుండా, ఈ సీజన్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా నిలిచింది. తిలక్ వర్మ అజేయ శతకానికి తోడు, అశ్విని కుమార్ పదునైన బౌలింగ్ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాయి.
మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం అంత ఆశాజనకంగా ఏమీ లేదు. స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ కేవలం 13 పరుగులకే నిష్క్రమించగా, సూర్యకుమార్ యాదవ్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే యువ సంచలనం తిలక్ వర్మ మైదానంలోకి అడుగుపెట్టాక ఆట స్వరూపమే మారిపోయింది. నమన్ ధీర్ (45)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన తిలక్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గాయమైనప్పటికీ పట్టుదల వదలకుండా కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తి చేశాడు. తిలక్ వీరవిహారంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరును సాధించింది.
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికే జస్‌ప్రీత్ బుమ్రా సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి గుజరాత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ వెంటనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రమాదకరమైన జోస్ బట్లర్‌ను అవుట్ చేసి ముంబైకి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విని కుమార్ అద్భుతమైన స్పెల్‌తో మెరిశాడు. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ వెన్నువిరిచాడు. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (26) మినహా ఎవరూ కనీస పోరాటం చేయలేకపోయారు. చివరలో గజన్ ఫర్ వరుస బంతుల్లో వికెట్లు తీయడంతో గుజరాత్ ఇన్నింగ్స్ 15.5 ఓవర్లలో 100 పరుగుల వద్దే ముగిసింది. అటు తిలక్ వర్మ సెంచరీ, ఇటు బౌలర్ల సమిష్టి కృషితో ముంబై ఈ సీజన్‌లో అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!