దక్షిణ కొరియాలో ఓ ఇంట్లో 1000 కుక్కలు చనిపోవడం కలకలం రేపింది. 60 ఏళ్ల ఓ వ్యక్తి 1000 కుక్కలను ఇంట్లోనే బంధించి ఆకలితో అలమటించేలా చేసిన అవి చనిపోయేంతవరకు అలాగే ఉంచాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.