Manchiryala Crime: మంచిర్యాల మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. యువతి వీడియో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchiryala Crime: మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన మహేష్ దారుణ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తన భర్త నుంచి తనను విడిపించాలని ఓ వివాహిత మహేశ్‌ను వేడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. తనను తన భర్త నుంచి దూరం చేయాలని మహేష్‌ను వేడుకున్న యువతి వీడియో కలకలం రేపుతోంది. హత్యకు ముందే మహేష్ తో వివాహిత వీడియో కాల్స్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. పోలీసులు ఈ వీడియోలను పరిశీలించి వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వివాహితను వేధించడం, అసభ్యకరమైన సందేశాలు పంపడం వల్లే మహేశ్‌ను యువతి కుటుంబసభ్యులు హత్య చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వీడియోలను చూస్తుంటే మహేష్ వివాహితను వేధించలేదని తెలుస్తోంది. వివాహిత కుటుంబ సభ్యులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తేల్చాలని మహేష్ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను కోరుతున్నారు.అయితే మంగళవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో మహేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి కుటుంబ సభ్యులు నలుగురు కలిసి మహేష్‌పై రాళ్లతో కొట్టి, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశారు. హత్య జరుగుతుండగా స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
అయితే మహేష్ హత్యపై అనేక వార్తలు వినిపించాయి. వివాహితను వేధించడంతో కుటుంబ సభ్యులు హత్య చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన యువతికి, మహేశ్‌కు గతంలో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. యువతి, మహేష్ గతంలో ప్రేమించుకుంటున్నారని, అయితే ఆమె మరో యువకుడితో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కోపంతో మహేశ్ యువతి భర్తకు తాము ప్రేమించుకున్న సమయంలోని సన్నిహిత వీడియోలు, ఫొటోలు పంపించాడు. యువతి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, అప్పటి నుంచి యువతి కుటుంబ సభ్యులు మహేష్‌పై ద్వేషం పెంచుకున్నారని చెబుతున్నారు.యువతిని చూసేందుకు మహేష్ రోజూ ఇంటికి వచ్చి హారన్ మోగించేవాడని, దీంతో కుటుంబసభ్యులు మరింత ఆగ్రహానికి గురయ్యారని చెబుతున్నారు. మంగళవారం కూడా వచ్చి హారన్ మోగించాడు. వివాహిత కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత రాయితో కొట్టి చంపారు. మహేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rain Alert: ఏపీకి వర్షసూచన.. రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
తాజావార్తలు
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!