Youth Extortion From Passengers In Bengaluru Airport Got Arrested: రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసేవాళ్లను మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ.. ఎయిర్‌పోర్టులో, అది కూడా టికెట్ కొనుగోలు చేసి మరీ భిక్షాటన చేసిన వారిని ఎప్పుడైనా చూశారా? బెంగళూరులో ఓ యువకుడు అలాంటి పని చేస్తూ పట్టుబడడ్డాడు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, ట్రీట్‌మెంట్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని, వేలల్లో డొనేషన్ ఇవ్వాలంటూ ప్రయాణికుల్ని అడుగుతూ తిరిగాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది.. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని, అతనిపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tom Cruise: ఆమెకు 46… అతనికి 60…!!
విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు టిప్-టాప్‌గా రెడీ అయి, బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. చెన్నైకి వెళ్లేందుకు ఒక ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేశాడు. లోపలికి వెళ్లేంతవరకు హుందాగా వ్యవహరించాడు. కానీ.. లోపలికి వెళ్లాక అతడు భిక్షాటన మొదలుపెట్టాడు. ‘‘మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మాకు అంత స్థోమత లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. ఒక్కొక్కరు రూ.10 వేలు చొప్పున డొనేషన్స్ ఇస్తే, మా నాన్నని కాపాడినవారు అవుతారు. మా తండ్రి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాడు’’ అంటూ ప్రయాణికుల ముందు తప్పుడు కథ చెప్పుకుంటూ భిక్షాటనకు దిగాడు. అతని ప్రవర్తనపై ఇతరులకు అనుమానం రావడంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Jama Masjid: జామా మసీద్ మెట్ల కింద ఉన్న హిందూ విగ్రహాలు స్వాధీనం చేసుకోవాలి.. కోర్టులో పిటిషన్
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, విఘ్నేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి.. 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ యువకుడి నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అందులో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదంతా ఒక ముఠా పని అయ్యుండొచ్చని, అందులో విఘ్నేశ్ ఒక సభ్యుడు అయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండేళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి సంఘటనే బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ తర్వాత ముంబైలోనూ ఓ యువకుడు ఇలాగే భిక్షాటన చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో.. దీని వెనుక ఎవరున్నారన్న విషయంపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు.