భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ఉరిశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. హత్య కేసులో నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. జూలై 16, బుధవారం ఉరిశిక్ష అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆమె 2017 నుంచి యెమెన్‌లో జైలులో ఉంది. యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన…
యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.
Death: ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని అమెరికాకు చెందిన ఒక నర్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన వివరాలు వైరల్‌గా మారాయి. ఇంటెన్సివ్ కేర్(ఐసీయూ)లో చాలా అనుభవం కలిగిన ఆమె చెప్పిన వివరాలు సంచలనంగా మారాయి.
ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటననను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్‌లో జూలై 30న జరిగింది.
బ్రిటన్‌లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది.…
యుపిలోని పిలిభిత్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్టాఫ్ నర్సు తన ఇష్టానుసారం వ్యవహరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఓ స్టాఫ్ నర్సు స్కూటర్ పై కూర్చొని నేరుగా పేషెంట్ల వార్డులో తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె చేసిన పని వల్ల కారిడార్ లో కూర్చొని చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Also Read: AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా..…
యూఎస్ లోని ఒరెగాన్‌లోని ఒక ఆసుపత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో 10 మంది రోగులు మృతి చెందారు.
అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది.