Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యలను సృష్టిస్తున్నాయని శరద్ పవార్ ఆరోపించారు.
ఎన్సీపీ జన్జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించే ముందు పవార్ మాట్లాడుత.., వర్గాల మధ్య చీలిక ఏర్పడిందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.“మన రైతులు ఉత్పత్తిని పెంచినందున దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు, బదులుగా వారు మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడుతున్నారు. సాధారణ ప్రజలను నెట్టివేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది” అని పవార్ అన్నారు. నేటి యువత విద్యావంతులని, ఉద్యోగాలు కోరే హక్కు వారికి ఉందని కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అన్నారు.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళ్తున్నాయని, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదని, దీని వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పవార్ తెలిపారు. “ఒకసారి నేను ప్రయాణిస్తున్నప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల 15 నుండి 20 మంది పురుషులు ఒక గ్రామంలోని పబ్లిక్ స్క్వేర్‌లో ఖాళీగా కూర్చోవడం నాకు కనిపించింది, నేను వారిని ఏమి చేస్తున్నారు అని అడిగాను, వారు గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు, వారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు. వారు వివాహం చేసుకున్నారా అని నేను అడిగినప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా స్పందించారు.” అని ఎన్సీపీ చీఫ్ అన్నారు.
Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్
కారణం ఏమిటని అడగ్గా.. తమకు ఉద్యోగాలు లేకపోవడంతో అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫిర్యాదులు ఎక్కువగా వినబడుతున్నాయని పవార్ పేర్కొన్నారు. కానీ ఉపాధి అవకాశాలను పెంపొందించే విధానాలను అవలంబించడానికి బదులుగా, వర్గాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యాదృచ్ఛికంగా ఏదో ఒక అంశాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!