High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High-Protein Black Chana Soup Recipe: రాత్రి వేళల్లో రోటీలు, కూరలు లేదా పప్పు-అన్నం లాంటి హెవీ ఫుడ్ తినాలనిపించదు. కడుపుకు తేలికగా ఉంటూ, వేగంగా తయారై, ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఉడకబెట్టిన నల్ల శనగలను రుబ్బి తయారుచేసే ఈ చట్పటా హై-ప్రోటీన్ సూప్ ఒక అద్భుతమైన ఆప్షన్. ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే నల్ల శనగలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బరువును అదుపులో ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, మిరియాల ఘాటైన తిరగమాతతో (తాలింపు) సిద్ధమయ్యే ఈ సూప్ రుచి ఎంత బాగుంటుందంటే.. పిల్లలైనా, పెద్దలైనా గిన్నెలకి గిన్నెలు ఖాళీ చేసేస్తారు. మరి ఈ పౌష్టికరమైన, రుచికరమైన సూప్‌ను తయారుచేసే ఆ అత్యంత సులువైన పద్ధతేంటో చూద్దాం!
కావలసిన పదార్థాలు:
1 కప్పు నల్ల శనగలు (రాత్రంతా నానబెట్టి, ఉడకబెట్టినవి)
1 పెద్ద చెంచా నెయ్యి లేదా వెన్న
1 చిన్న చెంచా జీలకర్ర
1/4 చిన్న చెంచా ఇంగువ
4-5 వెల్లుల్లి రెబ్బలు (సన్నగా తరిగినవి)
1 అంగుళం అల్లం తురుము
1 పచ్చిమిరపకాయ (సన్నగా తరిగినది)
1 ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
1/2 చిన్న చెంచా వేయించిన జీలకర్ర పొడి
1/2 చిన్న చెంచా మిరియాల పొడి
1/2 చిన్న చెంచా చాట్ మసాలా
1 పెద్ద చెంచా నిమ్మరసం
రుచికి సరిపడా ఉప్పు, నల్ల ఉప్పు
సన్నగా తరిగిన కొత్తిమీర (గార్నిషింగ్ కోసం)
Also Read
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
- Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
తయారీ విధానం:
ఉడకబెట్టిన నల్ల శనగల్లో ముప్పై వంతు (3/4 భాగం) శనగలను కొద్దిగా శనగల నీళ్లు పోసి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. మిగిలిన పావు వంతు (1/4 భాగం) ఉడకబెట్టిన శనగలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నెయ్యి లేదా వెన్న వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఇంగువ, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచి సువాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, కాస్త బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాండీలో రుబ్బి పెట్టుకున్న శనగల పేస్ట్, పక్కన ఉంచిన శనగలను వేయాలి. దాంతో పాటు వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, సాధారణ ఉప్పు, నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో శనగలు ఉడకబెట్టిన నీళ్లు (లేదా మామూలు నీళ్లు) 2 నుంచి 3 కప్పులు కలపాలి. మసాలాల రుచంతా సూప్‌కి బాగా పట్టేలా మీడియం మంట మీద 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. సూప్ చిక్కబడి, మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. చివరిగా పైన తాజా నిమ్మరసం, కొత్తిమీర చల్లుకోవాలి. వేడివేడిగా, చట్పటాగా ఉండే నల్ల శనగల సూప్‌ను బౌల్లో పోసుకుని తింటే అమృతంలా ఉంటుంది.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!