TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Office Attack Case: 2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు తెరవాలన్న పోలీసు ఆదేశాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎస్సీ వివాదం, శాప్ ఎదుట వైసీపీ నేతల నిరసన కార్యక్రమాల అనంతరం రౌడీ షీట్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు తెరవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 22వ తేదీన ఈ మేరకు అన్ని స్టేషన్లకు అధికారిక ఉత్తర్వులు పంపించారు. ఆయా కేసుల్లో ఉన్న వ్యక్తులపై రౌడీ షీట్లు తెరవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ నెల 29వ తేదీన గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులర్ పంపించారు. దీంతో రౌడీ షీట్ల విషయంలో పోలీస్ శాఖ వైఖరిలో మార్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, సీపీ రాజశేఖర్ బాబు రౌడీ షీట్లు తెరవాలని ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజవాడ పోలీసుల తీరును పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రౌడీ షీట్ల పేరుతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు తెరవాలని కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై న్యాయవాదులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత రౌడీ షీట్లు తెరవాలని ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ సీపీ తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. హైకోర్టులో నేడు జరగనున్న విచారణ నేపథ్యంలో కమిషనర్ గతంలో ఇచ్చిన ఆదేశాలు, ఆ తర్వాత వాటిని నిలుపుదల చేస్తూ జారీ చేసిన సర్క్యులర్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానం ఎలాంటి వైఖరి వెల్లడిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి