Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
- కాలి బూడిదైన 10 సీఎన్జీ బస్సులు
- మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బస్ డిపోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ముంబైలోని అనిక్ డిపో యార్డులో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో పలు CNG బస్సులు కాలిపోయాయి. అధికారుల వివరాల ప్రకారం.. సాయంత్రం 5:45 గంటల సమయంలో అనిక్ డిపో యార్డులో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 10 బస్సులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. దగ్ధమైన బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్ దాగా గ్రూప్ నుంచి తీసుకున్న వెట్-లీజ్డ్ ఎయిర్ కండిషన్డ్ మిడీ CNG బస్సులుగా అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదం సమయంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో పేలుడు శబ్దాలు కూడా వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దూరం నుంచే భారీగా నల్లటి పొగలు కనిపించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మంటల్లో చిక్కుకున్న బస్సుల నుంచి దట్టమైన నల్లటి పొగలు పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కనీసం నాలుగు ఫైర్ ఇంజిన్లు, ఐదు వాటర్ ట్యాంకర్లతో పాటు ఇతర అగ్నిమాపక వాహనాలను అక్కడికి తరలించారు. గంటకు పైగా శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల సమాచారం లేదని తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. మంటలు ఎలా చెలరేగాయి, ఆ తర్వాత బస్సులకు ఎలా వ్యాపించాయన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
VIDEO | Mumbai: Fire breaks out in empty electric bus at Anik Bus Depot near Sion, no injuries reported.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/yy41EFsLRR
— Press Trust of India (@PTI_News) October 5, 2026
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!