Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- ఉప ఎన్నికల పోలింగ్ నేడు
- నందిగ్రామ్, రేజీనగర్, నాగావ్ సహా 6 స్థానాల్లో ఓటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bypoll Election 2026: దేశవ్యాప్తంగా మరోసారి ఉప ఎన్నికల సందడి నెలకొంది. 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్ అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీవీకే, సీపీఐ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 9న ప్రకటించనున్నారు.
బీజేపీకి నందిగ్రామ్ ఎందుకు కీలకం?
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్ నియోజకవర్గాలపై రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నందిగ్రామ్ బీజేపీకి కీలకమైన నియోజకవర్గంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి శుభేందు అధికారి విజయం సాధించారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీపై కూడా ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. భవానీపూర్, నందిగ్రామ్ రెండు స్థానాల్లో గెలిచిన అనంతరం శుభేందు అధికారి నందిగ్రామ్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి నందిగ్రామ్ నుంచి బీజేపీ హసీరాణి రథ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున మిలన్ ప్రధాన్ పోటీ చేస్తున్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
రేజీనగర్‌లోనూ ఆసక్తికర పోటీ
రేజీనగర్ అసెంబ్లీ స్థానం కూడా ఈ ఉప ఎన్నికల్లో కీలకంగా మారింది. హుమాయూన్ కబీర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన పార్టీ తరఫున తన కుమారుడు గులాం నబీ ఆజాద్‌ను అభ్యర్థిగా బరిలోకి దించారు.
తమిళనాడులో సీఎం విజయ్‌కు తొలి పరీక్ష
తమిళనాడులో కూడా ఈ ఉప ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇవి తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్‌కు తొలి కీలక పరీక్షగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
పుదుచ్చేరిలోనూ ఉప ఎన్నిక
పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా నేడు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో మొత్తం 5 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
అక్టోబర్ 9న ఫలితాలు
ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అక్టోబర్ 9న అన్ని స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నందిగ్రామ్‌లో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? తమిళనాడులో సీఎం విజయ్‌కు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? అనే అంశాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!