H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
- ట్రంప్ హెచ్1బీ వీసా చర్యతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం..
- అమెరికాలో విమానాలు దిగిపోయిన భారతీయులు..
- న్యూఢిల్లీ నుంచి అమెరికాకు పెరిగిన విమాన ఛార్జీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న చర్యతో, ముఖ్యంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. దీనికి తోడు సెప్టెంబర్ 21 వరకు మాత్రమే గడువు విధించడంతో అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం మొదలైంది. ప్రకటన వెలువడిన వెంటనే భారతీయ టెక్కీలు విమానాల నుంచి దిగిపోయినట్లు నివేదికలు వస్తున్నాయి.
ఇదే కాకుండా, ట్రంప్ నిర్ణయాన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో భారత్ నుంచి అమెరికా వెళ్లే విమాన ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్‌లో చిక్కుకుపోయిన వారు హుటాహుటిన అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. దీంతో, అమెరికా వెళ్లే అన్ని విమానాల ధరలు పెరిగాయి. H-1B వీసాలు కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉండటంతో ఈ చర్య వారిని దెబ్బతీసింది.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: H-1B visa: ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..
నిబంధనల ప్రకారం, సెప్టెంబర్ 21, భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 9.31 గంటల లోపు అమెరికాలో ఉండాలి. ఆ తర్వాత, వ్యక్తికి స్పాన్సర్ చేసే కంపెనీ లక్ష డాలర్లు అంటే రూ. 88 లక్షలు చెల్లించకుంటే అతడిని అమెరికాలోకి అనుమతించరు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు H-1B వీసాలు కలిగి ఉన్న తమ ఉద్యోగులకు USను విడిచి వెళ్లవద్దని సూచించాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని కోరారు.
అయితే, భారత్‌లో సెలవులు, ఇతర పనుల కోసం వచ్చిన H-1B వీసాదారులు ఇప్పటికే గడువును కోల్పోయారు. భారత దేశం నుంచి నేరుగా విమానంలో ఇప్పటికి ఇప్పుడు వెళ్లినా సకాలంలో అమెరికా చేరుకునే అవకాశం లేదు. ట్రంప్ ప్రకటన వెలువడి వెంటనే రెండు గంటల్లోనే న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే విమాన ఛార్జీలు రూ. 37,000 నుంచి రూ. 80,000 కి పెరిగింది. కనెక్టింగ్ ఫ్లయిట్స్ ద్వారా ఇండియాకు వచ్చే వారు మధ్యలోనే తన విమానాలు దిగిపోయి, మళ్లీ అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కు వద్దామని ప్లాన్ చేసుకున్న వారు, తమ ప్రయాణాలను క్యాన్సల్ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!