14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. మీలో ప్రతిభ ఉంటే.. ఎవ్వరూ ఆపలేరని నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన సూర్యవంశీ ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా ఈ క్రీడారుడిని కాపాడుకోవాలంటూ.. క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి హెచ్చరించారు. ఛాపెల్ గతంలో టీం ఇండియా కోచ్‌గా కూడా పనిచేశారు. సూర్యవంశీ రాణించాలంటే సచిన్ టెండూల్కర్ లాంటి మద్దతు అవసరమని ఆయన అన్నారు.
READ MORE: Jobs Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో నోటిఫికేషన్ జారీ
సూర్యవంశీకి సచిన్ లాగా మద్దతు లభించకపోతే.. వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలకు ఎదురైన గతే ఎదురవుతుందని ఛాపెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘సచిన్ టెండుల్కర్ విజయానికి అతడి టాలెంట్ మాత్రమే కాదు. అతడి భావోద్వేగ పరిణితి, సచిన్‌కు చక్కటి మార్గనిర్దేశనం చేసిన చిన్ననాటి కోచ్, బాహ్య ప్రపంచపు సర్కస్‌లో పడి దారి తప్పకుండా కాపాడిన కుటుంబం సచిన్ విజయానికి కారణం. వినోద్ కాంబ్లీ సచిన్ అంత ప్రతిభావంతుడే. కానీ చిన్న వయసులో వచ్చిన గుర్తింపును హ్యాండిల్ చేయలేకపోయాడు. క్రమశిక్షణ తప్పాడు. చివరకు ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పతనమయ్యాడు. ప్రథ్వీ షా కూడా మరో యువ సంచలనం. అయితే, అతడు మళ్లీ శిఖరాగ్రానికి చేరే అవకాశం ఉండి ఉండొచ్చు. కాబట్టి.. యువ క్రీడాకారుల టాలెంట్ సరిగ్గా మలచాల్సిన అవసరం కూడా ఉంది’’ అని అన్నారు. సూర్యవంశీని కాపాడుకోవాలని బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సూచించారు. అతడికి మార్కెటింగ్ కోసం అతిగా వాడొద్దని నొక్కిచెప్పారు.
READ MORE: Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక పైరెట్స్ అటాక్..
సచిన్ విషయంలో ఏం జరిగింది?
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి కలిసి క్రీడా ప్రపంచాన్ని ఏలారు. ఇప్పుడు సచిన్ గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా గుర్తింపు పొందాడు. కానీ వినోద్ కాంబ్లీ పేరు చాలా తక్కువ మందికి తెలుసు! మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన కెరీర్‌లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) మొత్తం 34,357 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. మరోవైపు, కాంబ్లి 17 టెస్టులు, 104 వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. సచిన్ కి వచ్చిన క్రేజ్‌ను కాంబ్లి కూడగట్టుకోవడంలో విఫలమయ్యాడు. చిన్న వయసులోనే విజయాలను సొంతం చేసుకున్న వినోద్ మద్యానికి బానిసయ్యాడు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇదే విధంగా ముంబైలో చిన్న వయసులోనే గుర్తింపు పొందిన పృథ్వి షా కూడా తన కెరీర్‌లో రాణించలేకపోయాడు.