Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ పర్మిషన్ ఇచ్చారు.. దానికి తాను ఆందోళన చెందుతున్నానంటూ విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలంటూ క్వశ్చన్ చేశారు. ప్రతిపక్షాలు అబద్ధాలు సృష్టిస్తున్నారు.. ఇప్పుడు వాటిని నిజమని రుజువు చేయలేక ఇబ్బంది పడుతున్నారు.. నేను ఎప్పుడూ అసత్యం పలకలేదు, ఏ తప్పు చేయలేదు.. కాబట్టి భయపడాల్సిన అవసరం నాకు లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
Read Also: Transgender love story: ప్రేమలో మోసపోయిన ట్రాన్స్ జెండర్.. 73 మంది అబ్బాయిలపై ప్రతీకారం!
ఇక, ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యపై ట్రయల్ కోర్టు విచారణపై మధ్యంతర స్టేను సెప్టెంబర్ 9 వరకు కర్ణాటక హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో గవర్నర్ థావర్ గహ్లోత్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌పై ఎంక్వైరీని కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా తీసుకుంది. దానికి పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలను ఇచ్చింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ఏరియాలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు ఆరోపించారు.
దీంతో ఈ ఆరోపణలపై ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ తదితరులు కర్ణాటక గవర్నర్‌కు కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారంలో ఎందుకు ఎంక్వైరికీ ఆదేశించకూడదో తెలపాలని గతంలో సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గవర్నర్ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. తాను సీఎం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్‌పర్సన్ ఆర్‌వి దేశ్‌పాండే చేసిన కామెంట్స్ పై సిద్ధరామయ్య మండిపడ్డారు. ఎవరు సీఎం అవ్వాలనేది శాసనసభ్యులు, హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.