Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ పర్మిషన్ ఇచ్చారు.. దానికి తాను ఆందోళన చెందుతున్నానంటూ విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.