దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు కొంతమేర తగ్గుతున్నా, పూర్తిస్థాయిలో కేసులు ఎప్పటి వరకూ తగ్గుముఖం పడతాయి, సెకండ్ వేవ్ ఎప్పటికి తగ్గుతుంది అనే దానిపై స్పష్టత లేదు. నిపుణులు సైతం ఈ విషయంలో స్ఫష్టత ఇవ్వలేకపోతున్నారు. కరోనా తీవ్రత 5శాతంకంటే తక్కువగా నమోదైతే అన్‌లాక్ అమలు చేయవచ్చని, అన్‌లాక్ అమలు చేసినా, కరోనా నిబంధనలైన మాస్క్, శానిటేషన్, భౌతికదూరం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా వివిధ రకాలుగా మ్యూటేషన్ చెందుతుండటంతో ఏ మ్యూటేషన్ ఎప్పుడు తీవ్రంగా మారుతుందో అంచనా వేయలేకపోతున్నారు. ఇంగ్లాండ్‌లో కరోనా మ్యూటేషన్ కారణంగా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. తరువాత, ఇండియాలో బి.1.617 మ్యూటేషన్ కారణంగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మొదటి వేవ్ మాదిరిగా కాకుండా ఈ మ్యూటేషన్ కారణంగా దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో సెకండ్ పూర్తిగా ఎప్పటి వరకు తగ్గుతుందనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కరోనా కంట్రోల్‌లో ఉండాలంటే, తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.