* నేడు శ్రీహరి కోట నుంచి ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌బీ సీ-54 రాకెట్ ప్రయోగం.. సవ్యంగా సాగుతున్న కౌంట్ డౌన్.. రాకెట్ ద్వారా ఓషన్ శాట్ -3తో పాటు విదేశాలకు చెందిన 8 ఉపగ్రహాల ప్రయోగం
* నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం..
* నేడు సంగారెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టిఫా స్కాన్ మెషిన్ ప్రారంభం.. మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
* బాపట్ల: నేడు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* గుంటూరు: బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య కళావేదికలో విమర్శ ,వీక్షణం పుస్తకావిష్కరణ.
* గుంటూరు: తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ రంగస్థల, సినీ నటులు దర్శకులు, సునీల్ కుమార్ మిస్రోకు ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం ప్రధానం.
* గుంటూరు : నేడు పెదనందిపాడు రానున్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు.
* ఒంగోలులో దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి కార్యక్రమాలు, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కుటుంబ సభ్యులు..
* ప్రకాశం : కనిగిరిలో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్..
* చీరాల మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కరణం బలరాం..
* గుంటూరు: వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు లోని రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులు పాటు రైతు శిక్షణ తరగతులు.
* పల్నాడు: కారంపూడిలో నాలుగవ రోజు పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు.. నేడు కోడిపోరు ఉత్సవాన్ని నిర్వహించనున్న నిర్వాహకులు.
* తిరుమల: డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాలలో మార్పు చేయనున్న టీటీడీ.. డిసెంబర్ 1 నుంచి నెల రోజులు పాటు ప్రయోగాత్మకంగా ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్న టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి మూడు రోజుల పాటు రాజమండ్రిలో భవన నిర్మాణ కార్మికుల 7వ జాతీయ మహాసభలు
* విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలకు సీఎంతో పాటు పాల్గొననున్న హోం శాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత.. మధ్యాహ్నం 1 గంటకు లబ్బిపేటలో AP POLY TECHFESTలో పాల్గొననున్న మంత్రి.. సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి లోని సుబ్రమణ్య మైదానంలో జరిగే రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలకు హాజరు
* తణుకులో పర్యటించనున్న మంత్రి అంబటి రాంబాబు.. మంత్రి కారుమూరితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న అంబటి..
* ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పర్యటన.. రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్బంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ..
* విశాఖ: నేడు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం.. వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలు.. హాజరుకానున్న సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.
* విశాఖ: నేడు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం.. 2023-2024 సంవత్సరపు అంచనా బడ్జెట్ ఆమోదం కొరకు స్థాయి సంఘం సమావేశం.
* అనకాపల్లి: నేడు రోలుగుంట మండలంలో పలు గ్రామాల్లో స్టోన్ క్రషర్ల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ.. రోలుగుంట, శరభవరం, నిండుగొండ గ్రామాల్లో నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని పాపంపల్లి గ్రామంలో చేపట్టనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం విహరించనున్న పద్మావతి అమ్మవారు