* నేటి నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర, నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రకు నిర్ణయం.. పాల్గొననున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, 16వ తేదీ నుంచి పాదయాత్రకు రేవంత్
* విశాఖలో రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ,
* విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గిన వరద ఉధృతి, మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ, 70 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల, ఇన్‌ఫ్లో 4,05,338 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,91,375 క్యూసెక్కులు
* ఇవాళ, రేపు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన, ఉత్తర బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం,
* నేడు రెండో శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఆజాదీ కా అమృతోత్సవాలను 15న ఘనంగా కా నిర్వహించడానికి, విద్యార్థులు, టీచర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ నిర్ణయం.. నేడు విద్యార్థులతో పలు అంశాలపై రిహార్సల్స్.
* ప్రకాశం : గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* ప్రకాశం: తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామ సచివాలయం పరిధిలోని బుడ్డపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొననున్న ఎమ్మెల్యే కె. పి నాగార్జునరెడ్డి.
* కాకినాడ: నేడు పిఠాపురం లో హోం మంత్రి తానేటి వనిత పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి
* నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ లో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరు: ఆత్మకూరులో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: ఇందుకూరుపేట మండలం కోరుటూరు లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* వెంకటగిరిలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
* కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా
* నంద్యాల: నేడు వెలుగోడు రిజర్వాయర్ నుంచి సిద్దాపురం ఎత్తిపోతల పథకంకు నీటిని విడుదల చేయనున్న ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
* మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి స్వామి 351 సప్త ఆరాధనోత్సవాలు… నేడు మధ్యారాధన పురస్కరించుకుని స్వామి వారి మూలబృందావనంకు పాలాభిషేకం , మహా పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు….
* కర్నూలు: నేడు హాలహర్వి మండలం చత్రగుడి శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం… అభిషేకాలు, కుంకుమార్చన, మహా మంగళహారతి , ప్రత్యేక పూజలు, అన్నదానం
* తిరుమల కొనసాగుతోన్న భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండి.. వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు, సర్వదర్శనానికి 15 గంటల సమయం
* సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటన, స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొననున్న మంత్రి, ఉదయం 10:45 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి హరీష్ రావు, ఉదయం 11:00 గంటలకు 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ