* నేడు భారత్ -ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే, ఓవల్ వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
* విశాఖ: నేడు సింహాచలం దేవస్థానంలో గిరిప్రదక్షిణ, 4 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా, భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.
* భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు, కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
* నేడు నల్గొండ జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన, చందుపట్లలో గవర్నర్ టూర్.
* కోనసీమలో ఉధృతంగా గోదావరి ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో అలర్ట్, ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూటీంలను అప్రమత్తం చేసిన అధికారులు
* ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, 11.75 అడుగులు కి చేరిన నీటి మట్టం, బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తివేత
* కాకినాడ: నేడు తిమ్మాపురంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతికి స్వాగత సత్కార సభ, రేపటి నుంచి ప్రారంభం కానున్న చాతుర్మాస్య దీక్ష
* కాకినాడ: నేడు పంపా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల, తుని ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12500 ఎకరాల్లో విస్తరించి ఉన్న పంపా ఆయకట్టు
కాకినాడ: జిల్లాలో ఖాళీగా ఉన్న 123 వాలంటరీ పోస్ట్ లకి నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ, నిన్న కోర్టులో వాదోపవాదాల తర్వాత నేటికి వాయిదా వేసిన న్యాయమూర్తి.
* తిరుమల: నేడు రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలు రద్దు చేసిన టీటీడీ.
* అనంతపురం : తుంగభద్ర డ్యాం నుంచి నేడు హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయనున్న అధికారులు.