* ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నోతో గుజరాత్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ముంబై- పంజాబ్ మ్యాచ్ ప్రారంభం
* తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు..
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.. రంజాన్ వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నేడు సిద్దిపేటలో శిల్పారామం నిర్మాణానికి భూమి పూజ.. కోమటి చెరువు ప్రాంతంలోని బైపాస్ రోడ్డులో 25 కోట్లతో శిల్పారామం నిర్మాణం.. కోమటి చెరువు ప్రాంతంలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణం.. నేడు భూమి పూజ చేయనున్న మంత్రి హరీష్ రావు
* వరంగల్: నేటి నుండి భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు.. శనివారం నుంచి మే 3 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు
* తిరుమల: ఎల్లుండి ఆన్ సైన్ లో వర్చువల్ సేవా టికెట్లు కలిగిన భక్తులకు దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల.. 25వ తేదీ ఉదయం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పి.ఎస్.ఎల్.వి..సి 55 రాకెట్ ప్రయోగం.. సవ్యంగా సాగుతున్న కౌంట్ డౌన్.. రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనున్న ఇస్రో
* పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* కర్నూలు: మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ఉరేగింపు.
* అనంతపురం : ఈనెల 23 నుంచి శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో ఆలయ శతాబ్ది ఉత్సవాలు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* ప్రకాశం : యర్రగొండపాలెంలో రంజాన్ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..