Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా చిరస్మరణీయ సేవలు అందజేశారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం మౌనముని, మౌన ప్రధాని అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన ముద్రను వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోగా.. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల (2018) తర్వాత తొలిసారి మౌనముని విమర్శలపై రియాక్ట్ అయ్యాడు. ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకావిష్కరణలో మాట్లాడుతూ.. నన్ను మౌన ప్రధాని అని ఎద్దేవా చేసిన వారు.. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని చెప్పుకొచ్చారు.
Read Also: PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..
ఇక, మీడియాతో మాట్లాడటానికి భయపడిన ప్రధాన మంత్రిని కాదు.. నేను క్రమం తప్పకుండా ప్రెస్ తో మాట్లాడాను అని మన్మోహన్ సింగ్ తెలియజేశారు. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియా సమావేశం నిర్వహించాను అని వెల్లడించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నాను.. వాటి ఫలితాలను కూడా ఛేంజింగ్ ఇండియా అనే పుస్తకంలో రాసుకొచ్చాను అని మన్మోహన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read Also: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
అయితే, 2004 నుంచి 2014 వరకు యూపీఏ సర్కార్ లో 10 సంవత్సరాల కాలం పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా విధులు నిర్వహించారు. అలాగే, అంతకుముందు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చిరస్మరణీయ సేవలను ఆయన అందించారు. ఇక, 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చాడు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు వృద్ధిలోకి వచ్చింది. అందుకే ఆధునిక భారతదేశ ఆర్థిక రూపశిల్పిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు.