Law Commission: ఎన్నారైలు భారతీయ పౌరులను ముఖ్యంగా అమ్మాయిలను మోసపూరితంగా వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాసులు, భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో సమగ్ర చట్టాలను తీసుకురావాలని లా ప్యానెల్ సిఫారసు చేసింది. "ప్రవాస భారతీయులు మరియు విదేశీ పౌరులకు సంబంధించిన మ్యాట్రిమోనియల్ ఇష్యూలపై చట్టం"పై ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రీత్ రాజ్ అవస్తీ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు.
యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది.
పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సు వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లా కమిషన్ కీలక సూచనలు చేసింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లేనని, 16కి తగ్గించవద్దని లా కమిషన్ కేంద్రానికి సూచించింది.
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా ప్యానెల్ విశ్వసిస్తోందని వర్గాలు తెలిపాయి.
politics: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా కూడా భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావిస్తుంది. అలాగే తరచుగా ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్…
Law Commission: గత కొంత కాలంగా దేశద్రోహ చట్టం(sedition) చట్టం తొలగింపు, అమలుపై కీలక చర్చ జరుగుతోంది. దేహ్రద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ నుంచి కేరళ, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత, సమగ్రతను రక్షించేందుకు దేశద్రోహ చట్టం కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు.
మరణశిక్ష విధించే కేసులను పరిష్కరించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన శిక్ష తగ్గించే పరిస్థితులపై మార్గదర్శకాల రూపకల్పనకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సూచించింది.