West Bengal: రణరంగంగా బెంగాల్.. మమతాబెనర్జీ “లేడీ కిమ్” అంటూ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nabanna Abhiyan march in west bengal: పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్‌కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు. అనేక జిల్లాల్లో వేలాది మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి, లాకెట్ ఛటర్జీ, తాప్షి మోండోల్, దిబాంకర్ ఘరామిలతో సహా చాలా మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడం ఇదే మొదటిసారి. కోల్‌కతాలో నిరసన, ర్యాలీ చేపడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్ ఉపయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నిరసన కార్యక్రమాన్ని అణచివేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. హల్దియా, నందిగ్రామ్ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. సెక్రరేటియట్ వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు అధికారులు.
Also Read
- Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
Read Also: Nikhil: మొన్న తారక్.. నేడు నిఖిల్.. అమిత్ షా వ్యూహం అదే..?
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. లేడీ కిమ్ లాగా వ్యవహరిస్తున్నారని.. బెంగాల్ రాష్ట్రంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. ఉత్తర్ కొరియాలాగే.. బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ పాలిస్తున్నారంటూ విమర్శంచారు. సీఎం మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని.. నిన్నటి నుంచి పోలీసులు చేస్తున్న దాడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాలల్ లోని పలు జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు రైళ్లలో రాజధాని కోల్‌కతాకు చేరుకుంటున్నారు. ప్రజా తిరుగుబాటుకు టీఎంసీ ప్రభుత్వం భయపడుతోందని.. వారు మా ప్రదర్శనను ఆపడానికి ప్రయత్నించినా.. మేము శాంతియుతంగానే ప్రతిఘటిస్తామని.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!