Nabanna Abhiyan march in west bengal: పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్‌కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు.