Vitamin D supplement doesn’t reduce Covid risk: కరోనా సమయంలో పెద్దలు, పిల్లలు అంతా విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడారు. ముఖ్యంగా విటమిన్-సీ, విటమిన్-డి ట్యాబ్లెట్లు అవసరం లేకున్నా తెగ మింగారు. ఈ రెండు విటమిన్లు కరోనా నుంచి తమను కాపాడుతాయని భావించి చాలా మంది వీటిని తీసుకున్నారు. అవసరం లేకున్నా ముందు జాగ్రత్తగా విటమిన్ మాత్రలను వేసుకున్నారు. దీంతో ఆ సమయంలో విటమిన్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో మెడికల్ షాపుల్లో, ఆస్పత్రుల్లో విటమిన్ మాత్రలు లేని పరిస్థితి ఏర్పడింది.
Read Also: Home Minister Security Breach: హోం మంత్రి భద్రతా ఉల్లంఘన.. ఆంధ్రా ఎంపీ పీఏ అరెస్ట్
ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దవాళ్లలో విటమిన్ -డి స్థాయిలను స్థాయి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించలేదని తేలింది. రెండు క్లినికల్ ట్రయల్స్ లోనూ ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. మెడికల్ జర్నర్ ‘ ది బిఎమ్‌జె’ ఈ విషయాన్ని ప్రస్తావించింది. కోవిడ్ రోగులు విటమిన్ -డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని జర్నల్ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్దవారిలో విటమిన్ డీ పెద్దగా ప్రభావం చూపించలేదని పరిశోధనల్లో తేలింది.
కోవిడ్ 19 నుంచి రక్షణ పొందాలంటే ఇప్పటి వరకు ఉన్న ఉత్తమమైన, ప్రభావవంతమైన మార్గం కేవలం వ్యాక్సినేషనే అని చాలా మంది వైద్య నిపుణులు, పరిశోధకులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ పల్మనోలాజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ జేసీ ఖల్నానీ మాట్లాడుతూ.. విటమిన్ -డి లోపం ఉన్నప్పుడు మాత్రమే వాటిని సూచించాలని సలహా ఇచ్చాడు.