Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ వ్యక్తి. అంధురాలైన తన తల్లిని విమానంలోనే ఒంటరిగా వదిలేశారంటూ విమానయాన సిబ్బంది తీరుపై మండిపడుతూ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Also Read:ISRO Valarmathi: ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ స్వరం
అసలు విషయంలో వస్తే ఆయుష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల్లి అంధురాలు. ఆయన తన తల్లిని ఆగస్టు 31న దిల్లీ- కోల్‌కతా విస్తారా విమానం ఎక్కించారు. అయితే ఆమెకు విమాన సిబ్బంది సాయం అవసరం కావడంతో ఆయన టికెట్ కొన్న సమయంలోనే సిబ్బంది హెల్ప్ చేసే విధంగానే ట్రావెల్ ప్లాన్ ను ఎంచుకున్నారు. అంటే ఆమె విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫ్లై్ట్ సిబ్బంది తోడుగా ఉండాలి. ఆమెను తీసువచ్చి నిర్ధేశిత ప్రదేశంలో అప్పగించాలి. అయితే విమానం కోల్ కతాకు చేరుకున్న తరువాత ప్రయాణీకులందరూ వెళ్లిపోయిన తరువాత కూడా అంధురాలి గురించి ఎవరు పట్టించుకోలేదు. మొదట్లో కొద్దిసేపు వేచి ఉండాలని అంధురాలికి చెప్పిన సిబ్బంది తరువాత ఆమె విషయం మరచిపోయారు. అయితే క్లీనింగ్ సిబ్బంది వచ్చే వరకు ఆమె విమానంలోనే ఉండటంతో వారు ఎయిర్ లైన్స్ వారికి సమాచారం అందించారు. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. దీని గురించి తెలిపిన ఇన్ స్టా గ్రామ్ ఆయుష్ కేజ్రీవాల్ తన తల్లి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడేస్తారని మండిపడ్డారు. టికెట్ తీసుకున్నా మీకు దివ్యాంగ ప్రయాణీకుల సంరక్షణ పట్టదా? వారిని మీరసలు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. ఆయుష్ కు చాలా మంది నెటిజన్లు అండగా నిలబడ్డారు. దీనిపై విమానయాన సంస్థ స్పందిస్తూ.. వారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అంచనాలను అందుకోలేకపోయినందకు క్షమాపణలు తెలిపింది.