Bomb Threat: ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. గాలిలో 20 నిమిషాల తిరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
విస్తారా ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానంలో భద్రతా లోపాలు తలెత్తాయి. దీంతో విమానాన్ని టర్కీకి మళ్లించారు. ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లాల్సిన UK27 విమానం భద్రతా కారణాల దృష్ట్యా టర్కీలోని ఎర్జురం విమానాశ్రయానికి మళ్లించబడిందని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో తెలిపింది.
దేశంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపుల కాల్ వచ్చింది. శుక్రవారం నాడు 177 మంది ప్రయాణికులు, ఒక శిశువుతో శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే.. విమానయాన సంస్థ, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో…
Vistara Pilot Shortage : విస్తారా ఎయిర్‌లైన్స్‌కి చెందిన పలు విమానాలు ఈరోజు మళ్లీ రద్దు చేయబడ్డాయి. కంపెనీ న్యూఢిల్లీకి ఐదు, బెంగళూరుకు మూడు, కోల్‌కతాకు రెండు విమానాలు రద్దు చేయబడ్డాయి.
Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ…
విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు.
Flight Hijack : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తోంది. ఒక వ్యక్తి ఫోన్ కాల్‌లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు.
Naked Woman: ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హంగామా సృష్టించింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా నడిచింది.
ఇటీవల వరసగా పలు విమానాలు సాంకేతిక లోపాలతో ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. స్పైస్ జెట్ కు సంబంధించిన విమానాలు ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. లక్కీగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలో జరిగింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం యూకే-122 సింగిల్ ఇంజిన్ తోనే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో…