GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది. ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2026, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకునేలా కేంద్ర ఆర్థిక శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇందుకోసం 2017 నాటి జీఎస్టీ నియమాలలో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?
కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే, ముందుగా తమ చివరి పన్ను కాలానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్ పోర్టల్ ద్వారా రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటే, అధికారుల ప్రమేయం లేకుండానే నేరుగా పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. దరఖాస్తులో పేర్కొన్న తేదీ నుంచే ఈ రద్దు అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులకు ‘ఫామ్ జీఎస్టీ ఆర్ఈజీ-38’ (FORM GST REG-38) ద్వారా ఆన్లైన్లోనే పంపిస్తారు.
Also Read
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
- Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా 'హై ఫ్యాట్, షుగర్, సాల్ట్' హెచ్చరికలు..
- Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
అధికారుల పరిశీలనకు ఎప్పుడు వెళ్తుంది?
ఒకవేళ దరఖాస్తుదారుడు తమ రిటర్నులను సరిగ్గా దాఖలు చేయకపోయినా, లేదా ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు, వడ్డీలు, జరిమానాలు ఏవైనా బాకీ ఉన్నా ఆ దరఖాస్తు ఆటోమేటిక్‌గా రద్దు కాదు. అలాంటి దరఖాస్తులు సంబంధిత అధికారి పరిశీలనకు వెళ్తాయి. అన్ని బకాయిలు క్లియర్ చేస్తేనే సులభంగా ఆన్లైన్లో పని పూర్తవుతుంది.
కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మరింత సులభం..
కొత్తగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే వారి కోసం కూడా ప్రభుత్వం పోర్టల్‌లో మరిన్ని మార్పులు చేసింది. దరఖాస్తు ఫామ్ నింపేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా ఎప్పటికప్పుడు సూచనలు కనిపించేలా వెసులుబాటు కల్పించింది. పత్రాలను సులభంగా అప్లోడ్ చేసేందుకు డ్రాప్-డౌన్ బాక్సులను కూడా చేర్చింది. రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానాన్ని తెలుసుకోవడానికి జీఎస్టీ వెబ్‌సైట్‌లోని ‘హెల్ప్’ విభాగంలో ఉన్న ‘జీఎస్టీ నాలెడ్జ్ పోర్టల్’ ద్వారా స్టెప్-బై-స్టెప్ గైడ్‌ను కూడా అందుబాటులో ఉంచింది.
తాజావార్తలు
-
GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
-
IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
-
Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
-
Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా ‘హై ఫ్యాట్, షుగర్, సాల్ట్’ హెచ్చరికలు..
-
Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!