కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరూర్ తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ తరపున న్యాయవాదులు దీక్షితా గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, యష్ ఎస్ విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ఇన్సిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు అక్టోబర్ 3న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విజయ్ సవాలు చేశారు. హైకోర్టు ఏర్పాటు చేసిన బృందంతో కాకుండా స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: TATA War: టాటా గ్రూప్లో అంతర్యుద్ధం.. అమిత్ షా దగ్గరకు పంచాయితీ
ఇదిలా ఉంటే టీవీకే అధినేత విజయ్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను కలిసేందుకు పరామర్శ బాటపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేసి విషయం తెలియజేశారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇది కూడా చదవండి: Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!