Pakistan: ముస్లిం మెజారిటీ కలిగిన పాకిస్తాన్‌లో ‘‘జగన్నాథ రథయాత్ర’’ ఘనంగా జరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది హిందువులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లిం ఆధిపత్యం ఉన్న దేశంలో, హిందూ సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. సాధారణంగా ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా జరుగుతుంది. అయితే, ఇదే సంప్రదాయాన్ని పాకిస్తాన్‌లో కూడా కొనసాగిస్తున్నారు.
Read Also: Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
ఈ వేడుకల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. మతపరమైన జెండాలతో పాటు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. పాకిస్తాన్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో హిందువుల సంఖ్య పరిమితంగా ఉంది. 2023 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం 2.17 హిందూ జనాభా ఉన్నట్లు తెలిపింది. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రావిన్సులో ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూసిన యూజర్లు, పాకిస్తాన్‌లో ఇలాంటి హిందూ వేడుకని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Jagannath Rath Yatra, Pakistan 🙌 pic.twitter.com/DWiKx8zcGa
— Hindutva Knight (@HPhobiaWatch) July 7, 2024