Samsung workers strike: సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటుంది. దేశంలోనే అతి పెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కంపెనీ నుంచి వాకౌట్ చేసింది.
Semiconductor Plants: ఎలక్ట్రాన్సిక్స్, ఆటోమొబైల్ రంగంతో పాటు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో కీలకమైన సెమీకండక్టర్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చైనా, తైవాన్ వంటి దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోనే చిప్ తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు భారతదేశంలో మూడు సెమీకండక్టర్ల ప్లాంట్లనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. రానున్న…
Chips Factory : సెమీకండక్టర్ (చిప్) రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలను లెక్కించడం ప్రారంభించింది.
Foxconn : తైవాన్ అతిపెద్ద కంపెనీ ఫాక్స్‌కాన్ భారతదేశానికి కొత్తేమీ కాదు. ఆపిల్ అతిపెద్ద తయారీదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలో తన పట్టును మరింత బలంగా స్థాపించడానికి ప్రయత్నిస్తోంది.
Tamilnadu : ఇటీవల దేశంలో సెమీకండక్టర్ అంటే చిప్ పరిశ్రమ కోసం పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా చిప్స్ విషయంలో దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది.
ఇండియాకు మరో టెక్ కంపెనీ రాబోతోంది. చైనాలో ఉన్న తైవాన్‌కు చెందిన సెమీకండక్టర్‌కు చెందిన టెక్ కంపెనీని ఇండియాకు తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. చైనా, తైవాన్‌ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే చైనాలో కొనసాగుతున్న కంపెనీలను తైవాన్ ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
వేదాంత మరియు ఫాక్స్‌కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్‌కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్‌కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది.
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడింది. కొన్ని దేశాలు మాత్రమే సెమీకండక్టర్లను తయారు చేస్తున్నాయి. దీంతో భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మారి కాలంలో ట్రాన్స్‌ఫోర్ట్ ఫెసిలిటీ తగ్గిపోవడంతో ఈ కొరత ఏర్పడింది. అంతేకాదు, పరిశ్రమలను మూసివేయడం కూడా ఇందుకు ఒక కారణం. ఈ కొరత తగ్గి తిరిగి యధాస్థితికి రావాలి అంటే చాలా కాలం పడుతుంది. చాలా దేశాలు సొంతంగా ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు సెమీకండక్టర్లు తయారు చేస్తున్న…