Viral Video : ప్రస్తుతం మనిషి జీవనశైలి మారుతోంది. బిజీ జీవితంలో ఇంటి భోజనం చేయడమే కుదరడం లేదు. దీంతో హోటల్స్, రెస్టారెంట్లలోకి వెళ్లే వారి సంఖ్య చాలా పెరిగింది. అక్కడ కస్టమర్లు చాలా మంది ఫుడ్‌ను వేస్ట్ చేస్తూ ఉంటారు. చట్నీలను సగం తినేసి వదిలేస్తారు. వాటిని హోటల్ సిబ్బంది డస్ట్‌బిన్‌లో పడేయాలి. కానీ.. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్ నిర్వహకులు చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మాత్రం జన్మలో బయట తినరు. హోటల్, రెస్టారెంట్లలో తినాలంటేనే కచ్చితంగా జంకుతారు. ఎందుకంటే.. వారి తీరు అలా ఉంది మరి.
Read Also:RCB Bowlers: విరాట్ కోహ్లీనే తక్కువ రన్స్ ఇస్తాడేమో.. ఆర్‌సీబీపై శ్రీకాంత్ సెటైర్లు!
హైదరాబాద్ బేగంపేట ఏరియాలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలో హోటల్ సిబ్బంది ఓకరు కస్టమర్లు తినగా మిగిలిపోయిన టమోట సాస్, చట్నీలను కిచెన్‌లోకి తీసుకొచ్చాడు. అనంతరం వాటన్నంటిని మరో గిన్నెలోకి వేశాడు. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అయితే మిగిలిపోయిన చట్నీలు, సాస్‌లను మరుసటి రోజు ఉపయోగిస్తారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. పక్కనే ఉన్న ఓ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తీయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also:Pemmasani Chandrashekar: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి..
ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. దాదాపు ప్రతి రెస్టారెంట్, హోటల్స్‌లోనూ ఇదే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. ‘వేరే రెస్టారెంట్లలోనూ ఇలాగే చేస్తారేమో..ఇలాంటివి చూస్తే భయమేస్తుంది.’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. కాగా.. ఇది చాలా కామన్ అని చాలా హోటళ్లో మిగిలిపోయిన నాన్‌వెజ్ వంటకాలు చికెన్ టిక్కా వంటి వాటివి మరుసటి రోజు పుదీనా చట్నీతో కలిపి ఇస్తారని అన్నారు. హైదరాబాద్ హోటల్లో శుభ్రత కోరకువటం దండగ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు జీహెచ్ఎంసీ స్పందించింది. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ త్వరగా సమస్యను పరిష్కరిస్తుందని తెలిపింది.
కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్ లో వేసి మరుసటి రోజు వాడడం ఈ Mezbaan రెస్టారెంట్ ప్రత్యేకత.
Green Chutney and Ketchup leftover by customers are stored and served next da. This is the speciality of Mezbaan at Begumpet, Hyderabad pic.twitter.com/N0PxYf0Qg4
— musicofarun (@musicofarun) April 16, 2024