Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Floods: అస్సాంలో సంభవించిన భారీ వరదలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా హెచ్చరిక ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్‌లో ఒకరు మరణించడంతో వరద మృతుల సంఖ్య ఏకంగా 78కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షలకు పైగా ప్రజలు వరద కష్టాల్లో మునిగిపోయారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు నీటమునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల పంట పొలాలు మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బాధిత జిల్లాల్లో చరాయిదేవు పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఏకంగా 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత శివసాగర్, జోర్హాట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాల్లో 16,500 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ కేంద్రాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు. వరద తాకిడికి మౌలిక వసతులు, రోడ్లు, పాఠశాలలు ధ్వంసమవ్వడమే కాకుండా.. 11,000కు పైగా జీవాలు కొట్టుకుపోయాయి. మరో వైపు రాజధాని గువాహటితో పాటు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో అర్బన్ ఫ్లడ్డింగ్ (పట్టణ వరదలు) ఇంకా వీడలేదు. పడుంబరి, బోరాగావ్, జూ రోడ్, హాతిగావ్ వంటి అనేక ప్రాంతాలు బురద, నీటితో నిండిపోయాయి.
పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. వరద నీరు తగ్గుముఖం పట్టినా, ఇళ్లలోకి చేరిన బురద, ధ్వంసమైన రోడ్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రుణ సదుపాయాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ తూర్పు ప్రాంత పర్యటనలో భాగంగా సేనలు చేపడుతున్న వరద సహాయక చర్యలను సమీక్షించి, బలగాల సేవలను అభినందించారు. ఇదిలా ఉంటే, వాతావరణ శాఖ (IMD) నుంచి మరో బాంబు లాంటి వార్త వచ్చింది. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీన్సుకియాతో పాటు పొరుగు రాష్ట్రాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాల వల్ల మళ్లీ హఠాత్తుగా వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో, సహాయక బృందాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్‌లో ఉన్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..