పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్‌లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం. పెళ్లంతా ఒకెత్తు అయితే.. భోజనాలు మరొకెత్తు. ఇక్కడే చాలా పెళ్లిళ్లలో తేడా కొడతాయి. అడిగింది వేయలేదనో.. పక్కవాడికి వేసి… నాకు వేయలేదనో.. ఇలా ఏదొక విషయంలో గొడవలు జరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా జైలుకెళ్లిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడెందుకు ఈ ముచ్చట అంటారా? అయితే ఈ వార్త చవాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి పెళ్లిలో పనీర్ వడ్డించలేదని ఏకంగా ట్రావెల్ బస్సును విందుశాలపైకి పోనిచ్చాడు. దీంతో అతిథులకు గాయాలు కావడంతో పాటు లక్షల ఖరీదైన వంటకాలన్నీ నేలపాలయ్యాయి. ఈ ఘటన చందౌలి జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Yellamma : నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్
మొఘల్సరాయ్ కొత్వాలి ప్రాంతంలోని హమీద్‌పూర్ గ్రామంలో రాజ్‌నాథ్ యాదవ్ కుమార్తె వివాహం జరిగింది. శనివారం సాయంత్రం ‘బరాత్’ (వివాహ ఊరేగింపు) ఆలస్యంగా వేదిక దగ్గరకు చేరుకుంది. అంతా బాగానే జరుగుతోంది. ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి.. పెళ్లిలో భోజనం చేస్తున్నాడు. పనీర్ కావాలని అడిగాడు. అది లేదని పెళ్లివారు బదులిచ్చారు. దీంతో అతడు కోపం పట్టలేకపోయాడు. వెంటనే మినీ బస్సుతో ఫుడ్ స్టాల్స్ వైపు దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు అతిథులతో పాటు రూ.3లక్షల ఖరీదైన వంటకాలు నాశనం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో గందరగోళం నెలకొనడంతో అక్కడ నుంచి ధర్మేంద్ర యాదవ్ బయటకు జారుకున్నాడు. ఈ ఘటనలో వరుడి తండ్రి, వధువు మామ సహా అనేక మంది గాయపడ్డారు. వెంటనే వారిని వారణాసిలోని ట్రామా సెంటర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసేంత వరకు పెళ్లి జరగదని వరుడి తరపు వారు పట్టుపట్టారు. దీంతో నిందితుడిపై వధువు తరపు వారు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహం జరగడంతో కథ సుఖాంతం అయింది.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ..