YS Jagan: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (ఏప్రిల్ 29) సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తాజా, పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు.