‘అల వైకుంఠపురములో’ని అందగాడి చేతుల మీదుగా ‘అల అమెరికాపురములో’ ప్రోమో!

‘అలా అమెరికాపురములో’… థమన్ తన టీమ్ తో సందడి చేయబోతున్నాడు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వరుస కచేరిలతో ఎన్నార్ లను అలరించనున్నాడు. ఇటువంటి మ్యూజికల్ టూర్స్ బాలీవుడ్ సంగీత దర్శకులు, గాయకులకు మామూలే. మన వాళ్లు చాలా తక్కువగా విదేశాల్లో మ్యూజికల్ కన్సర్ట్స్ ప్లాన్ చేస్తుంటారు. పైగా గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న కరోనా కల్లోలం పరిస్థితుల్ని మరింత కఠినతరంగా మార్చేసింది. అయినా, యూఎస్ లో నెలకొంటోన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా త్వరలోనే థమన్ అండ్ హిజ్ ఫ్లైట్ ఎక్కేయబోతున్నారు.
థమన్ ‘అల అమెరికాపురములో’ స్వర ప్రస్థానానికి అధికారికంగా అల్లు అర్జున్ శ్రీకారం చుట్టాడు. ఆయన చేతుల మీదుగా ప్రోమో విడుదలైంది. వాషింగ్టన్ డీసీ, చికాగో, న్యూ జెర్సీ, సాన్ జోస్, డల్లాస్ లాంటి అమెరికన్ సిటీస్ లో టీమ్ థమన్ పర్యటించనుంది.
‘అల వైకుంఠపురములో’ సినిమాతో థమన్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సినిమాలో బాణీలకు అల్లు అర్జున్ స్టెప్స్ ప్రేక్షకుల్ని అనూహ్య రీతిలో అలరించాయి. ఇప్పుడు అదే అల్లు అర్జున్ ‘అల అమెరికాపురములో’ ప్రోమో విడుదల చేయటంతో అందరిలోనూ థమన్ యూఎస్ టూర్ పై ఆసక్తి నెలకొంది. ‘అల వైకుంఠపురములో’ పాటలు ‘అల అమెరికాపురములో’ మ్యూజికల్ కన్ససర్ట్స్ సందర్భంగా జనాల్ని ఊర్రూతలూగించనున్నాయి…

-Advertisement-‘అల వైకుంఠపురములో’ని అందగాడి చేతుల మీదుగా ‘అల అమెరికాపురములో’ ప్రోమో!

Related Articles

Latest Articles