UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం
- యూపీ హాథ్రస్లో ఘోరం
- క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Minister Ramanaidu: సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ పాఠశాల మూఢ నమ్మకాలను విశ్వసించి ఓ విద్యార్థిని బలి ఇవ్వడం యూపీలో సంచలనంగా మారింది. స్కూల్ ప్రతిష్ఠను పెంచుకునేందుకు రెండో తరగతి విద్యార్థిని బలి ఇచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాథ్రస్లోని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని బలి ఇచ్చిందని వెల్లడించారు. స్కూల్ హాస్టల్లో అతడిని చంపేశారని తెలిపారు. ఈ వారంలోనే జరిగినా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల డైరెక్టర్ తండ్రి బ్లాక్ మ్యాజిక్‌ను విశ్వసిస్తాడని వెల్లడించారు. తొలుత స్కూల్ బయట ట్యూబ్‌వెల్ సమీపంలో ఆ పిల్లాడిని చంపాలనుకున్నారని, అయితే హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు అతడు భయంతో కేకలు వేయడంతో గొంతు నులిమి హత్యచేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు దీవినే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
సోమవారం పాఠశాల యాజమాన్యం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని సమాచారం ఇచ్చారన్నారు. కారులో డైరెక్టర్ తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాడని సిబ్బంది చెప్పారన్నారు. తర్వాత ఆ కారులో తన కుమారుడి మృతదేహం కనిపించిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు బ్లాక్ మ్యాజిక్కు సంబంధించిన వస్తువులను గుర్తించారు. ఈ కేసులో పాఠశాల యజమాని జశోధన్ సింగ్, అతని కుమారుడు, స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న దినేష్ బాఘేల్, ముగ్గురు ఉపాధ్యాయులతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..