UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన
- పర్యటనపై సరికొత్త ఊహాగానాలు
- షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రాలు. దీంతో ఇప్పటి నుంచే ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇటీవల బీజేపీ కొత్త కూటమిని ప్రకటించాయి. ఈ కూటమి ఎన్నికల కోసమేనని వార్తలు వచ్చాయి. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్నారు. లక్నోలో కీలక పర్యటన సాగుతోంది. ఇక మంగళవారం 500 మందికి పైగా బీఎల్ఓలతో జ్ఞానేష్ కుమార్ సమావేశం కానున్నారు. దీంతో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందే జరగవచ్చని తాజా పరిణామాలను బట్టి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
వాస్తవానికి యూపీ అసెంబ్లీ పదవీ కాలం మే 22, 2027తో ముగుస్తుంది. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా జ్ఞానేష్ కుమార్ ముందస్తు పర్యటన సరికొత్త ఊహాగానాలకు తెరలేపడమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని రేకితిస్తోంది.
అయితే ఇది ఎన్నికల యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే సీఈసీ పర్యటిస్తున్నారని వర్గాలు చెబుతున్నారు. అంతేకాని ముంద్తు ఎన్నికలు నిర్వహించడం కోసం కాదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడం కోసమే జ్ఞానేష్ కుమార్ పర్యటిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల సంఘంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. పాఠశాలలు, కళాశాలల ద్వారా యువతను ఓటర్ నమోదు చేయించుకునేందుకు ప్రోత్సహించడం అని చెబుతున్నారు. అలాగే ఓటింగ్ పట్ల వారిలో అవగాహన పెంచి.. తద్వారా సకాలంలో తమ ఓటరు గుర్తింపు కార్డులను పొందేలా చూడటం దీని లక్ష్యం అని అంటున్నారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!