KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
- తాగునీటికే కృష్ణా జలాలు
- 50:50 వాటాపై తెలంగాణ ప్రతిపాదన
- పోతిరెడ్డిపాడుపై మళ్లీ వివాదం
- 47 టీఎంసీలపై ఏపీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటి వాటాల వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని కమిటీ నిర్ణయించింది.
తాగునీటి పంపిణీపై తెలంగాణ ప్రతిపాదనలు
సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు మాట్లాడుతూ.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి పంపిణీని 50:50 రేషియో ప్రాతిపదికన చేపట్టాలని కమిటీ ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా చేపడుతున్న నీటి వాడకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఇప్పటికే తమ వాటా కంటే అదనంగా 10 టీఎంసీల నీటిని వాడుకుందని, ఇకపై అక్కడ నుంచి నీటిని వాడబోమని ఏపీ అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాల సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా చర్చించేందుకు సెప్టెంబర్ 4వ తేదీన మరొక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
నీటి వినియోగంపై ఏపీ స్పందన
ఏపీ ఈఎన్సీ నరసింహ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల తాగునీటి ప్రాధాన్యతపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఏడాది మొత్తం నీటి వినియోగానికి సంబంధించిన నివేదికను తెలంగాణ అందించగా, ఏపీ మాత్రం అక్టోబర్ నెల వరకు అవసరమైన నీటి పంపిణీకి ప్రతిపాదనలు పెట్టింది. రాబోయే కాలానికి సంబంధించి 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ కోరగా, దానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో నీటి వాటాల నిష్పత్తికి సంబంధించిన అంశం చర్చకు రాలేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా, పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు 22 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సమ్మతించిందని ఏపీ ఈఎన్సీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!