Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: కశ్మీరీ పండిట్లపై దశాబ్దాల క్రితం జరిగిన అత్యంత ఘోరమైన నరమేధాలపై జమ్మూ కశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) విచారణను పునఃప్రారంభించింది. దాదాపు 28 ఏళ్ల క్రితం 1998లో 23 మంది కశ్మీరీ పండిట్లను దారుణంగా హత్య చేసిన వంధామ (Wandhama) ఊచకోత కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. లోయలో ఉగ్రవాదం పరాకాష్ఠకు చేరిన సమయంలో జరిగిన ఈ కీలక హత్యల వెనుక ఉన్న నిజమైన హంతకులను, వారికి సహకరించిన వారిని గుర్తించడమే లక్ష్యంగా SIA అధికారులు లోయలో పలు ప్రాంతాల్లో ఇటీవలే విస్తృత సోదాలు నిర్వహించారు. 1998 జనవరి 25న, రిపబ్లిక్ డే ముందు రోజు రాత్రి గాందర్బల్ జిల్లాలోని వంధామ గ్రామంలోకి అత్యాధునిక ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్ల ఇళ్లలోకి జొరబడి 9 మంది మహిళలు, 4 గురు పిల్లలు సహా 23 మందిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. పవిత్ర రంజాన్ మాసంలోని షబ్-ఎ-ఖదర్ రాత్రివేళ జరిగిన ఈ భయంకర దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ కేసును SIA ఇప్పుడు సీరియస్‌గా తీసుకొని తవ్వితీస్తోంది.
కేవలం వంధామ ఘటనే కాకుండా, మరికొన్ని ప్రముఖ పండిట్ నేతల హత్యల కేసులను కూడా ఏజెన్సీ తన రీసెర్చ్ పరిధిలోకి తెచ్చింది. 1989 సెప్టెంబర్‌లో శ్రీనగర్‌లోని తన నివాసం వద్ద దారుణ హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది, నాటి జమ్మూ కశ్మీర్ బీజేపీ ఉపాధ్యక్షుడు టికా లాల్ ట్యాప్లూ కేసును SIA వేగవంతం చేసింది. అలాగే జేకేఎల్ఎఫ్ (JKLF) ఉగ్రవాది మక్బూల్ భట్‌కు మరణశిక్ష విధించిన జస్టిస్ నీలకాంత్ గంజూను 1989 నవంబర్ 4న శ్రీనగర్‌లోని హరిసింగ్ స్ట్రీట్‌లో కాల్చి చంపిన ఘటనపై కూడా బృందాలు లోతుగా విచారిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కశ్మీరీ పండిట్లపై జరిగిన పాత నేరాల ఫైళ్లను తెరుస్తున్న ఏజెన్సీ, ఇటీవలే 1990 నాటి నర్స్ సర్లా భట్ హత్య కేసులో 737 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అందులో జైలులో ఉన్న జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రచయిత సర్వానంద్ కౌల్ ప్రేమీ, ఆయన కుమారుడు వీరేందర్ కౌల్ల దారుణ హత్య కేసుకు సంబంధించి కూడా జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి మూలనపడ్డ ఉగ్ర ఘటనల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వారి సహచరులకు చట్టపరంగా శిక్ష పడేలా SIA తన విచారణ చక్రాన్ని తిప్పుతోంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..