కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వెంటనే పంపించేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్థాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసింది.
చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవలం…
దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24గంటల్లో దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలను నివారించడంలో 97శాతం…
కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ విషయంలో బాధ్యత రాష్ట్రాలకే వదిలేసింది.. అయితే, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించగా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్రమే వ్యాక్సిన్లు పంపిణీ…