Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
- నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్‌పై అందరిలో ఆసక్తి..
- అతిపెద్ద బడ్జెట్ స్పీచ్ నిర్మలమ్మదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండియాని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి అంతా ఎదురుచూస్తు్న్నారు. శనివారం, ఆమె వరసగా 8వ సారి కేంద్ర బడ్జెన్‌ని ప్రవేశపెట్టబోతున్నారు.
భారత బడ్జెట్ చరిత్రలో అతిపెద్ద, అతిచిన్న బడ్జెట్ ప్రసంగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Also Read
అతిపెద్ద బడ్జెట్ ప్రసంగాలు:
నిర్మల సీతారామన్: 2020 బడ్జెట్ ప్రదర్శన సమయంలో, ఆర్థిక మంత్రి సీతారామన్ మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, భారత చరిత్రలో అతి సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020-21 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. 2019 బడ్జెట్ సందర్భంగా ఆమె చేసిన 2 గంటల 19 నిమిషాల బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. 2020లో ఆమె సొంత రికార్డుని ఆమె బద్దలు కొట్టారు.
జస్వంత్ సింగ్: నిర్మలా సీతారామన్ ముందు అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ జస్వంత్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 2023లో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. 2014లో అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
Read Also: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు:
హిరుభాయ్ ఎం. పటేల్: భారతదేశ బడ్జెట్ చరిత్రలో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ చేసిన ప్రసంగం నిలిచిపోతుంది. ఆయన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో తయారు చేశారు.
పదాల పరంగా చూస్తే 1991లో అప్పటి ఆర్థిక మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌దే. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్ తెరిచిన ఈ కీలక బడ్జెట్ ప్రసంగంలో 18,600 పదాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రపంచీకరణ వైపు తీసుకెళ్లింది. పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!