Umar: ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
- ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది
- వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మాహుతి దాడి అని.. ఇంకొందరు పొరపాటున కారు బ్లాస్ట్ జరిగిందని వాదనలు వినిపించాయి. ఇలా రకరకాలైన కథనాలు వచ్చాయి. వీటిన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఉగ్రవాది డాక్టర్ ఉమర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు డాక్టర్ ఉమర్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా ఆత్మాహుతి దాడి గురించి ప్రస్తావించాడు. ఆత్మాహుతి దాడి గురించి తప్పుడు భావన ఉందని పేర్కొన్నాడు. ఆత్మాహుతి వాదనేలేదని.. దాన్ని బలిదాన చర్యగా అభివర్ణించాడు. ఇస్లాంలో ఆత్మాహుతి దాడి లేదని.. బాలిదానపు ఆపరేషన్‌గా వివరించాడు. అమరవీరుల ఆపరేషన్‌గా కూడా పేర్కొన్నాడు. ఈ వీడియోలో పూర్తిగా ఇంగ్లీష్‌లో మాట్లాడాడు.
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇది కూడా చదవండి: Al-Falah University: అల్-ఫలాహ్ వర్సిటీలో ఈడీ దాడులు.. 25 చోట్ల ఏకకాలంలో సోదాలు
ఒక నిర్దిష్ట ప్రదేశం, సమయంలో చనిపోతానని భావించినప్పుడు.. సహజ మరణానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని ఆత్మాహుతి దాడి కాదని.. దాన్ని బలిదాన ఆపరేషన్‌గా తెలిపాడు. దీనిపై భిన్నమైన వాదనలు, వైరుధ్యాలు కూడా ఉన్నట్లు చెప్పాడు. ఒక నిర్దిష్ట పరిస్థితిలో చనిపోతే మాత్రం బలిదానం ఆపరేషన్ అంటారని చెప్పాడు. వీడియోలో ఉమర్ మాట్లాడుతున్న విధానాన్ని చూస్తుంటే.. సహచర ఉగ్ర డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సహచరులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండేందుకు ఉమర్ ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో చేసినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: వామ్మో.. ఉగ్రవాదులు ఒళ్లు గగుర్పొడిచే ప్లాన్.. వెలుగులోకి కొత్త ప్రణాళిక!
పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ మైకంలో పడిన డాక్టర్లు పూర్తిగా ఉగ్రవాదులుగా మారిపోయారు. మొత్తం వారి బ్రెయిన్ ఉగ్రవాదం వైపునకు మళ్లినట్లు కనిపిస్తోంది. టెర్రర్ మాడ్యూల్‌లో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారని.. వారిలో ఐదు నుంచి ఆరుగురు వైద్యులు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీ నుంచి పేలుడు పదార్థాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు అవగాహనకు వచ్చారు. తాజా వీడియోలో ఉమర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఆత్మాహుతి దాడి అని కాకుండా.. దానికి బలిదాన ఆపరేషన్‌గా పేర్కొంటున్నాడు. అంటే ఢిల్లీ బ్లాస్ట్ కచ్చితంగా ఆత్మాహుతి దాడిగానే చెప్పొచ్చు. కేవలం దాని అర్థం మాత్రమే మార్చాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్.
ఉమర్ ఎవరు?
డాక్టర్ ఉమర్ పుల్వామాలోని కోయిల్ గ్రామవాసి. ఎంబీబీఎస్ కోసం గంటల తరబడి చదివేవాడని బంధువులు పేర్కొన్నారు. చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని తెలిపారు. అయితే పోలీస్ వర్గాల ప్రకారం.. ఉమర్ ప్రవర్తన ఇటీవల కాలంలోనే మారిపోయినట్లుగా భావిస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి యూనివర్సిటీ విధులకు దూరంగా ఉంటున్నాడు. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ చుట్టూ అనేకమార్లు ప్రయాణం చేశాడు. ఈ సమయంలోనే రాంలీలా మైదాన్, సునేహ్రీ మసీదు, దాని సమీపంలోని మసీదులను సందర్శించాడు.
నవంబర్ 9న ఫరీదాబాద్‌లోని ఒక గిడ్డంగి దగ్గర నుంచి 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ వార్త తెలియగానే ఉమర్ అదృశ్యమయ్యాడు. హర్యానాలోని ధౌజ్ గ్రామం సమీపంలో అజ్ఞాతంలోకి వెళ్లాడని, ఐదు ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అనంతరం నవంబర్ 10న ఎర్రకోట దగ్గర పేలిన కారు బ్లాస్ట్‌లో ఉమర్‌తో పాటు మరో 13 మంది చనిపోయారు. ఇక ఫరీదాబాద్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ పలుమార్లు టర్కీకి వెళ్లివచ్చినట్లుగా అధికారులు కనుగొన్నారు.
🚨 Terrorist Umar recorded a spine-chilling video before the Delhi blast, which has now come to light. pic.twitter.com/jX38wXcHw1
— OsintTV 📺 (@OsintTV) November 18, 2025
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!