ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మాహుతి దాడి అని.. ఇంకొందరు పొరపాటున కారు బ్లాస్ట్ జరిగిందని వాదనలు వినిపించాయి. ఇలా రకరకాలైన కథనాలు వచ్చాయి.
Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 14 మంది మరణించగా.. దాదాపుగా 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ వర్ధంతిని పురస్కరించుకుని బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్…
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది
Suicide Bombing: టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
ISIS Plan To Attack In India: భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర చేసింది. అధికార పార్టీలో కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఈ ప్లాన్ ను భగ్నం చేసింది రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). ఇండియాలో ఆత్మాహుతి ఉగ్రదాడి చేసేందుకు ఐసిస్ కుట్రను ముందుగానే పసిగట్టింది రష్యా. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రష్యా అధికారులు. ఈ విషయాన్ని సోమవారం రష్యా వార్త…