బీహార్ రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. రాజ్యసభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్‌తో పాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంత సడన్‌గా నిర్ణయం తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే బీజేపీ-జేడీయూ మధ్య కీలక ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంటుండగా.. జేడీయూ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండనున్నారు. ఈ మేరకు జేడీయూ వర్గాలు పేర్కొన్నాయి. రెండు వర్గాల మధ్య నిర్ణయం జరిగినట్లుగా వెల్లడించాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: కార్తీక్ దండుపై ప్రశంసల వర్షం కురిపించిన నాగచైతన్య..
త్వరలో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంపై జేడీయూ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. శాసనసభా పక్ష సమావేశం నిర్వహించకుండానే ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వాదనలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని జేడీయూ నేత విజయ్ కుమార్ చౌదరి తెలిపారు.
బీహార్ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు మార్చి 16న జరగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం చివరి రోజు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత బలాన్ని బట్టి చూస్తే పార్లమెంట్ ఎగువ సభకు నితీష్ కుమార్ ఎన్నిక దాదాపు ఖాయం.
ఇది కూడా చదవండి: Iran War: ఇరాన్ దాడులకు యూఎస్ భారత్‌ను ఉపయోగించుకుందా..? వాస్తవం ఇదే..