PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: వెనెజువెలాలో సంభవించిన భీకర జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు సృష్టించిన విధ్వంసంపై గురువారం సోషల్ మీడియా వేదికగా (X) స్పందించిన ఆయన.. బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బుధవారం సాయంత్రం వెనెజువెలా కరిబియన్ తీరంలో సంభవించిన ఈ జంట భూకంపాల (7.2 మరియు 7.5 తీవ్రత) ధాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయి జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపాల ప్రకంపనలు దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతం వరకు కూడా తెలిసివచ్చాయి. భూకంప తీవ్రతకు గోడలు కూలిపోవడం, నగరాల్లో పెద్ద ఎత్తున ధూళి మేఘాలు కమ్మేయడంతో రాజధాని కరాకస్ సహా పలు నగరాల్లో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఒక శతాబ్ద కాలంలో వెనెజువెలాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇవి ఒకటిగా నిలిచాయి. మోరోన్ నగరానికి పశ్చిమంగా కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు సంభవించాయి.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో ఆస్తి నష్టం జరిగిందని ధృవీకరించారు, అయితే మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజధానిలోని ప్రధాన విమానాశ్రయమైన ‘సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం’ తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని మూసివేశామని, దేశవ్యాప్తంగా పాఠశాలలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో దేశంలోని ఆరోగ్య సిబ్బంది అందరూ అత్యవసర విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, ఫాల్కన్ రాష్ట్ర గవర్నర్ విక్టర్ క్లార్క్ అందించిన సమాచారం ప్రకారం.. అక్కడ 32 మంది ఆసుపత్రి పాలయ్యారని, శిథిలాల కింద చిక్కుకున్న మరో 15 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!