IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
- నేడు బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు
- కొడితే గట్టిగా కొట్టాల్సిందే
- బంగ్లాపై గెలవకుంటే టీమిండియా ఇంటికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Semi-Final Hopes on the Line as Bangladesh Challenge Awaits: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు కీలక మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. దక్షిణాఫ్రికాపై ఓటమి పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన.. ఈరోజు బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. సెమీస్ చేరాలంటే భారత్ మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. చివరి మ్యాచ్ పటిష్ట ఆస్ట్రేలియాతో భారత్ ఆడాల్సి ఉంది. ఆసీస్ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. ఒకవేళ గెలిచినా భారీ తేడాతో విజయం అంటే ఇంకా కష్టమే. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్‌ను బలంగా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవడం ఇప్పుడు హర్మన్‌ప్రీత్ సేనకు తప్పనిసరి.
మిడిల్ ఆర్డర్ ఆందోళన:
ఈరోజు భారత జట్టు కొన్ని బలహీనతలను అధిగమించి పూర్తి స్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. నెదర్లాండ్స్‌పై మినహాయిస్తే బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుత ఆరంభాలు అందిస్తున్నారు. ఈ ఇద్దరూ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే ఆ తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో భారత బ్యాటర్లు విఫలమవుతున్నారు. మధ్య ఓవర్లలో పరుగుల వేగం తగ్గిపోవడంతో చివర్లో రిచా ఘోష్, దీప్తి శర్మలపై అధిక భారం పడుతోంది. బలమైన జట్లపై ఈ బలహీనత భారత్‌కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. హర్మన్‌ప్రీత్, జెమీమా జోరందుకోవాల్సి ఉంది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలుగమ్మాయిపై భారీ అంచనాలు:
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు మరో సమస్య కూడా బయటపడింది. 25 పరుగులకే రెండు వికెట్లు తీసినా.. ఫీల్డింగ్‌లో కీలక అవకాశాలను చేజార్చుకోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. నాకౌట్ దశకు చేరువవుతున్న ఈ సమయంలో ఇలాంటి తప్పిదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. పేస్ బౌలింగ్‌లో భారత్ మెరుగుపడాల్సిన అవసరముంది. తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుత స్పిన్ బౌలింగ్‌పై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌లపై విజయాలు సాధించడం ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించింది. ఒకరిపై ఆధారపడకుండా సమష్టి కృషితో విజయాలు అందుకోవడం ఆ జట్టు ప్రత్యేకతగా నిలిచింది.
భారత్‌కు ఎంతో కీలకం:
భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ పోరులో విజయం సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ దిశగా మరింత ముందడుగు వేయడంతో పాటు ఆస్ట్రేలియాతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ మరో సంచలన విజయం నమోదు చేస్తే గ్రూప్-ఏ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. భారత్ బ్యాటింగ్ విభాగంపైనే అందరి దృష్టి ఉన్నప్పటికీ..ఈ మ్యాచ్ ఫలితాన్ని ఒత్తిడి పరిస్థితులను ఎవరు మెరుగ్గా ఎదుర్కొంటారన్నదే నిర్ణయించే అవకాశముంది.
మ్యాచ్ వివరాలు:
సమయం: జూన్ 25, సాయంత్రం 7:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్
లైవ్ స్ట్రీమింగ్ యాప్: జియోహాట్‌స్టార్
జట్లు:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యస్తిక భాటియా, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్, నందిని శర్మ, శ్రీ చరణి.
బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా (కెప్టెన్), నహిదా అక్తర్ (వైస్ కెప్టెన్), దిలారా అక్తర్, జువైరియా ఫిర్దౌస్, శోభనా మోస్తారీ, తేజ్ నెహార్, షర్మిన్ అక్తర్, రబేయా ఖాన్, రితు మోని, షోర్నా అక్తర్, ఫహిమా ఖాతున్, ఫరీహా త్రిస్నా, మారుఫా అక్తర్, సంజిదా అక్తర్ మేఘ్లా, సుల్తానా ఖాతున్.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!