Twin Sisters: కవలలుగా పుట్టిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లాడిన సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వివాహ వేదికపై ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వరుడు అతుల్ స్వస్థలం షోలాపూర్ కాగా కవల వధువులు రింకీ, పింకీ ముంబైలోని కండివాలికి చెందినవారు. అతుల్‌కు ట్రావెల్ ఏజెన్సీ ఉండగా.. కవల సోదరీమణులు ముంబైలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట తండ్రి మరణించగా ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటున్నారు. ఆరు నెలల క్రితం రింకీ, పింకీ తల్లి అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో అతుల్ తన ట్యాక్సీలో వీరిని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
Read Also: Financier Attacked: పోలీస్టేషన్ లో హంగామా.. వాహనదారుడిపై ఫైనాన్షియర్స్ కత్తితో దాడి
అలా అతుల్‌తో రింకీ, పింకీలకు పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన తల్లిని రక్షించాడనే కృతజ్ఞత ఇద్దరిలోనూ నాటుకుపోయింది. దీంతో ఇద్దరూ అతుల్‌నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఈ వివాహానికి అంగీకరించారు. వారి సమక్షంలోనే శుక్రవారం పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. కాగా పెళ్లి కుమారుడిపై పోలీసులు బహుభార్యత్వం కేసు నమోదు చేశారు .ఐపీసీలోని 494 సెక్షన్ కింద వరుడు అతుల్‌పై కేసు రిజిస్టర్ అయిందని పోలీసులు వివరించారు.
Atul married Twin sisters who work as IT engineers in Mumbai in Solapur district of Maharashtra.
Families of Brides & Groom agreed for this Marriage. pic.twitter.com/swPzoYOiYN
— Syed Rafi – నేను తెలుగు 'వాడి'ని. (@syedrafi) December 4, 2022